• Login / Register
  • Jai Sreeram | రాముడి మార్గం అర్థం చేసుకుంటే యుద్దాలు ఆగిపోతాయి

    వార‌ణాసిలో రాముడికి హార‌తి ప‌ట్టిన ముస్లిం మ‌హిళ‌లు
    ఇజ్రాయిల్‌, పాల‌స్తినా వంటి దేశాలు రాముడి మార్గం అనుస‌రించాల‌ని సూచ‌న‌

    Hyderabad : భార‌త దేశంలో ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకునే దీపావ‌ళి ఒక్క మ‌తానికే ప‌రిమ‌తం కావ‌డం లేదు. దీపావ‌ళి పండుగ అన్ని మ‌తాల‌కు సంబంధించినది గా భావిస్తున్నారు. చీక‌టిపై వెలుగు సాధించిన దీపావ‌ళి విజ‌యాన్ని అంద‌రూ జ‌రుపుకుంటారు. అందులో భాగంగా వార‌ణాసిలో ముస్లిం మ‌తానికి చెందిన మ‌హిళ‌లు పూర్తి భ‌క్తితో శ్రీ‌రాముడికి హార‌తి ప‌ట్టారు. ఆయ‌న పేరు మీద దీపాలు వెలిగించారు. వార‌ణాసిలోని లాంహిలో ఉన్న ముస్లిం మ‌హిళా ఫౌండేష‌న్ కొత కొన్ని సంవ‌త్స‌రాలుగా దీపావ‌ళిని ఇదే విధంగా జ‌రుపుకుంటుంద‌ని స‌మాచారం. ముస్లిం మ‌హిళ‌లు త‌మ చేతుల‌తో ఉర్ధూలో రాముడికి హార‌తి ఇచ్చారు. `హే రాజా రామ్ తేరీ హార‌తి ఉతారు` అనే కీర్త‌న కూడా పాడారు. ఈ నేప‌థ్యంలో వారు యావ‌త్ ప్ర‌పంచానికి శాంతి సందేశాన్ని అందించారు. రాముని మార్గాన్ని అనుస‌రించ‌డానికి వారు ప్రేరేపించారు. ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాచార్య మాట్లాడుతూ 2006లో వార‌ణాసిలో సంక‌ట్ మోచ‌న్ టెంపుల్ వ‌ద్ద జ‌రిగిన బాంబు సంఘ‌ట‌న త‌ర్వాత ఈ సంప్ర‌దాయం మొద‌లైంద‌ని తెలిపారు. శ్రీ‌రామ‌న‌వ‌మి, దీపావ‌ళి పండుగ రోజుల‌లో ముస్లిం మ‌హిళ‌లు ఆచారాల ప్ర‌కారం శ్రీ‌రాముని హార‌తి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన‌ట్లు అక్క‌డి ధ‌ర్మాచార్య పేర్కొన్నారు. దేశంలో ప్ర‌జ‌ల‌కు శాంతి సౌభ్రాత్రుత్వం, శాంతి సందేశాన్ని అందించ‌డ‌మే దీని ప్ర‌ధాన ల‌క్ష్యం అని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ముస్లింలు మాట్లాడుతూ రాముడి మార్గం అనుస‌రిస్తే ర‌ష్యా-ఉక్రేయిన్, ఇజ్రాయిల్‌-హ‌మాస్ మ‌ధ్య న‌డుస్తున్న యుద్దాలు ఆగిపోతాయ‌ని తెలిపారు. అలాగే ఇజ్రాయిల్‌, పాల‌స్తీనా వంటి దేశాలు రాముడి బాట‌లో న‌డువాల‌ని సూచించారు.
    *  *  *  

    Leave A Comment